Jagathguru Bhodalu Vol-6        Chapters        Last Page

నిరాశ్రయం మాం జగదీశ రక్ష!

సంపత్క రాణి సకలేంద్రియ నందనాని

సామ్రాజ్యదాన విభవాని సరోరుహాక్షి!,

త్వద్వందనాని దురితోద్ధరణోద్యతాని

మామేవ మాత రనిశం కలయన్తు మాన్యే.

-కనకధారాస్తవం.

ఒకప్పుడు భగవత్పాదులవారు భిక్షార్థియై ఒక యింటికి వెళ్లాడు. ఆ ఇంటి ఇల్లాలు లేమితో బాధపడుతూ ఉన్నందున భిక్ష ఏమి ఇవ్వలేక ఒక ఉసిరికాయ ఇంటిలో ఉంటే దానిని తెచ్చి ఆచార్యుల చేతిలో ఉంచినదట. ఆమె పేదరికమునకు ఆచార్యులవారు చాల నొచ్చుకొని లక్ష్మీదేవిని ప్రార్థించగా ఆమె ప్రసన్నయై కనకధారను కురిపించినదట! అందుచే ఆచార్యులవారప్పుడు చదివిన శ్లోకములకు కనకధారా స్తవం అని పేరు వచ్చినది. ఈ ఇతిహాసాన్ని గురించి శకర విజయం-

స ముని ర్మురజిత్కుటుంబినీం

పదచిత్రై ర్నవనీతకోమలైః,

మధురై రుపతస్ధివాన్‌ స్తవై

ర్ద్విజ దారిద్య్ర దశా నివృత్తయే.

అని పేర్కొన్నది.

ఓ తల్లీ! కమలములను బోలిన కన్నులు కలదానవై మాన్యవైన నీకు నమస్కరించిన వారికి సకల సంపదలు కలుగుతాయి. ఇంద్రియములకు సైతము సంతసం కలుగుతుంది. సామ్రాజ్య వైభవం కూడా నీవు ప్రసాదించగలవు. నాదురితముల నన్నిటిని పోగొట్టి నన్ను ధన్యున్ని చెయ్యి- అని పైశ్లోకంలోని (కనకధారాస్తవం) భావం.

'త్వద్వందనాని దురితోద్ధణోద్యతాని'- ఆమెకు చేసే వందనం దురితోద్ధరణ పాటవం కలది. అట్టి ప్రభావంతో కూడిన వందనం తన్ను వదలరాదని- 'మామేవ అనిశం కలయంతు'-అని ఆచార్యులవారు ప్రార్థిస్తున్నారు 'ఈవందనం ఉన్నదే, ఇది ఒక్కటే నాకున్న ఆస్థి. ఆ తల్లి తలచుకొంటే సామ్రాజ్యమునైన ఇవ్వగలదు. అందుచే కృపామయి జగదీశ్వరీ ఈ వందన భాగ్యం నా వద్దనే ఉండునట్లు చేయవలే'- అన్న ప్రార్థనలో భగవత్పాదులవారు భక్తునకు పరమేశ్వరీ చరణాలలో ఉండవలసిన ప్రపత్తి యొక్క పరమార్థాన్ని బోధిస్తున్నారు.

పాప నిష్కృతికి ఒక్కటే మార్గం. అది జగన్నాథుని అర్ధాంగి మంగళ##దేవతయొక్క చరణములనే నమ్ముకొని శరణాగతి చెందడం. మనమందరము ఆ జగన్మాతయొక్క చరణములనే నమ్ముకొని సుఖశాంతులను పొందుముగాక!


Jagathguru Bhodalu Vol-6        Chapters        Last Page